Header Banner

వైసీపీకి గ్రేటర్ విశాఖలో ఊహించని షాక్! టీడీపీ కండువా కప్పిన కార్పొరేటర్.. గాజువాకలో రాజకీయ ఉత్కంఠ!

  Fri Apr 11, 2025 20:01        Politics

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ అవిశ్వాస పరీక్షకు సమయం దగ్గర పడుతోన్న వేళ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ కండువా కప్పేసుకోవడానికి సిద్ధం అయ్యారు. గాజువాక ప్రాంతానికి చెందిన వంశీ.. వైసీపీకి గుడ్బై చెప్పి.. పార్టీ మారడం ఆసక్తికర పరిణామం. అయితే, తిప్పల వంశీ రెడ్డి తండ్రి తిప్పల నాగిరెడ్డి 2019 ఎన్నికల్లో.. గాజువాక నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్పై విజయం సాధించారు. గత ఎన్నికలో టిక్కెట్ లభించకపోయినా జగన్మోహన్ రెడ్డి వెన్నంటే వున్నారు. ప్రస్తుతం వంశీ సోదరుడు దేవన్.. గాజువాక వైసీపీ ఇంఛార్జ్ ఉన్నారు. మరో ముగ్గురు కార్పొరేటర్లను తమవైపు తిప్పుకో గలిగితే కూటమి మ్యాజిక్ ఫిగర్కు చేరువయినట్టే లెక్క. మరోవైపు, వైఎస్ఆర్సీపీ నుంచి ఇటీవల కూటమిలో చేరిన వాళ్లకు టచ్లోకి వెళ్లింది. మారుతున్న సమీకరణాల నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ఎటువంటి ఒత్తిళ్లు లేకుండానే కార్పొరేటర్లు.. తమ పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పారు. మేయర్ పీఠం మారుతుందనే కాన్ఫిడెన్స్ తమకు ఉందన్నారు పల్లా శ్రీనివాస్..


ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్! తొలిగింపు లిస్టులో నెక్స్ట్ వారే.!


మొత్తంగా విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానంలో మరో ట్విస్ట్ వచ్చి చేరినట్టు అయ్యింది.. కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డితో ఉదయం నుంచి ఓ హోటల్లో మంతనాలు సాగించారు TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్., ఎమ్మెల్యేలు వెలగపూడి, వంశీ యాదవ్.. అయితే, మ్యాజిక్ ఫిగర్ కు ఇంకా రెండు ఓట్లు దూరంలో ఉంది కూటమి. మేయర్ పీఠం ఖచ్చితంగా కూటమిదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.. కాగా, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం చుట్టూ రాజకీయం రసకందాయంలో పడింది. అవిశ్వాసం నెగ్గితే మేయర్, డిప్యూటీ మేయర్ పంపకాలపై కూటమిలో ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది.. డిప్యూటీ మేయర్ పై క్లారిటీ రాకుండా క్యాంప్ రాజకీయాలకు వెళ్లలేమని జనసేనలో సగం మంది కార్పొరేటర్లు తేల్చేశారట.. దీంతో అటు టీడీపీ, ఇటు జనసేన నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు., క్యాంప్ రాజకీయాలు దేశం దాటేయడంతో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. టీడీపీ కార్పొరేటర్లు మలేషియాలో మకాం వేస్తే.. వైసీపీ తన వర్గాన్ని శ్రీలంకలో మోహరించింది. కమ్యూనిస్టు పార్టీలకు ఇద్దరు సభ్యులు ఉండగా.. అవిశ్వాసం ఓటింగ్ కు దూరంగా ఉంటారని సమాచారం. ఇక, ఈ నెల 19వ తేదీన జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. మేయర్ హరి వెంకట కుమారి అవిశ్వాస పరీక్షలో నెగ్గుతారా..? లేదా..? అనేది అప్పుడు తేలనుంది..

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!


రేషన్ కార్డు EKYC పూర్తి చేసుకున్నారా! లేకపోతే అవి రావు! త్వరగా ఇలా చెక్ చేసుకోండి!


పేదల కలలు నెరవేర్చిన లోకేష్.. 1,030 మందికి శాశ్వత ఇంటిపట్టాలు! 5వ రోజు "మన ఇల్లు" కార్యక్రమం!


పోలీసులపై జగన్ వ్యాఖ్యలు హేయం.. క్షమాపణ చెప్పాలి! బీజేపీ అధ్యక్షురాలు ఆగ్రహం!


వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #YSRCPShock #TDPEntry #GajuwakaPolitics #GVMC #PoliticalTwist #Visakhapatnam